స్టార్ హీరో హీరోయిన్ల రిలేషన్‌షిప్‌ను కన్ఫామ్ చేసిన అనిల్ కపూర్!
on Jan 5, 2021

బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు టైగర్ ష్రాఫ్, దిశా పటాని మధ్య రిలేషన్‌షిప్ గురించి సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ కాకతాళీయంగా బయటపెట్టేశారు. అవును. పాపులర్ టెలివిజన్ కామెడీ షో 'ద కపిల్ శర్మ షో'లో పాల్గొన్న అనిల్‌ను ఎవరి డైట్‌ను మీరు దొంగిలించాలని అనుకుంటున్నారని కపిల్ అడగగా, ఆయన టైగర్ ష్రాఫ్ పేరు చెప్పారు. ఇప్పటివరకూ తాను టైగర్‌తో కలిసి పనిచేయలేదని చెప్పిన అనిల్, "లేకిన్ ఉస్కీ జో వో హై నా.. దిశా పటానీ, ఐ హ్యావ్ స్టోలెన్ హర్ డైట్ (ఫిట్‌గా ఉండటానికి)." అని చెప్పారు. అలా.. టైగర్, దిశ మధ్య బంధాన్ని ఆయన బయటపెట్టారు.
కొన్నేళ్ల నుంచే టైగర్, దిశ డేటింగ్‌లో ఉన్నారంటూ బాలీవుడ్ కోడై కూస్తూనే ఉంది. కానీ ఇద్దరూ తమ బంధాన్ని బహిర్గతం చెయ్యలేదు. ఇటీవలే వారు మాల్దీవులకు వెళ్లి జాలీగా గడిపొచ్చారు. ముంబై రెస్టారెంట్లలో వారు తరచూ కలిసి కనిపిస్తుంటారు. టైగర్ అక్క కృష్ణ ష్రాఫ్, తల్లి ఆయేషా ష్రాఫ్‌లతో క్లోజ్‌గా ఉండే దిశ, వారితో కలిసున్న పిక్చర్స్‌ను షేర్ చేస్తుంటుంది కూడా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



