బాలకృష్ణ 'వంశానికొక్కడు'కి పాతికేళ్ళు
on Jan 5, 2021

నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన పలు ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ బాక్సాఫీస్ వద్ద విజయకేతనం ఎగరవేశాయి. వాటిలో 'వంశానికొక్కడు' ఒకటి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన శరత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్యకి జోడీగా రమ్యకృష్ణ, ఆమని నటించగా.. కీలక పాత్రల్లో సత్యనారాయణ, జయంతి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబూ మోహన్, చలపతి రావు, తనికెళ్ళ భరణి, శివాజీ రాజా, అన్నపూర్ణ, వై. విజయ, కల్పనా రాయ్ దర్శనమిచ్చారు.
శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ కుటుంబ కథా చిత్రానికి కోటి స్వరాలు సమకూర్చారు. వలచి వలచి, అబ్బా దాని సోకు, ప్రియా మహాశయా, యబ్బా నీ వాలు కళ్ళు, దండాలయ్యో దండమండి.. ఇలా ఇందులోని పాటలన్నీ అప్పట్లో విశేష ప్రజాదరణ పొందాయి. 1996 జనవరి 5న విడుదలై విజయం సాధించిన 'వంశానికొక్కడు'.. నేటితో పాతికేళ్ళు పూర్తిచేసుకుంటోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



