రియూనియన్ పార్టీలో రాధ డాన్స్.. చిరు హగ్.. వీడియో వైరల్!
on Nov 23, 2022
ఒకప్పుడు చిరంజీవి, రాధ హిట్ పెయిర్‌గా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. ఆ ఇద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు డ్యూయెట్స్‌లో పోటాపోటీగా ఇద్దరూ చేసే డాన్స్ అందర్నీ అలరించేది. అందుకే తనకు డాన్సుల్లో రాధ సరిజోడి అని ఓ సందర్భంలో చిరు కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. కట్ చేస్తే.. మరోసారి రాధ డాన్స్ చిరును ఫిదా చేసేసింది. 1980ల కాలం నాటి హీరోలు హీరోయిన్లు ఒక గ్రూప్‌గా ఏర్పడి ప్రతి యేటా రియూనియన్ పార్టీ చేసుకుంటూ వస్తున్న విషయం మనకు తెలుసు. ఈసారి ముంబైలో బాలీవుడ్ యాక్టర్ జాకీ ష్రాఫ్ ఇల్లు ఈ పార్టీకి వేదికగా మారింది.
ఆనాటి తారలు.. చిరంజీవి, వెంకటేశ్, జాకీ ష్రాఫ్, అనిల్ కపూర్, అర్జున్, భానుచందర్, నరేశ్, భాగ్యరాజ్, శరత్‌కుమార్, రాధ, సుహాసిని, పూనం థిల్లాన్, ఖుష్బూ, లిజి, సుమలత, శోభన, స్వప్న, అంబిక, రేవతి, నదియా, సరిత, పూర్ణిమా భాగ్యరాజ్ తదితరులు ఈ పార్టీలో సందడి చేశారు.
'సజ్‌నా హై ముఝ్‌సే' అనే పాటకు ఎంతో గ్రేస్‌ఫుల్‌నెస్‌తో రాధ చేసిన డాన్స్ అందర్నీ అలరించింది. గంతులేమీ లేకుండా వయ్యారంగా చేతులు, నడుము కదిలిస్తూ రాధ డాన్స్ చేస్తున్నంత సేపూ 'వావ్'.. 'సూపర్'.. 'సో బ్యూటిఫుల్' లాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చేశారు మిగతా తారలు. వెంకటేశ్ అయితే ఆమె మెడలో పూలమాల వేశారు. చివరలో చిరంజీవి ఉండబట్టలేక రాధ దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు.
దీనికి సంబంధించిన వీడియోను రాధ తన సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేశారు. "నా ఫేవరేట్ సాంగ్స్‌లో ఒకదానికి డాన్స్ స్టెప్స్ వేయడం చాలా సంతోషాన్నిచ్చింది. అన్నింటికీ మించి నా డియర్ కొలీగ్స్ అయిన చిరంజీవి, వెంకటేశ్, జాకీ ష్రాఫ్, పూనం థిల్లాన్, స్వప్న, సరిత అక్క, మిగతా అందరూ నాకు సపోర్ట్ చేసి, ప్రేమ కురిపించడం చాలా బాగనిపించింది." అని రాసుకొచ్చారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
