సూపర్ స్టార్ రజనీకాంత్ కు కోర్టు సమన్లు
on Mar 8, 2016

సూపర్ స్టార్ రజనీకాంత్ కు మదురై కోర్టు సమన్లు జారీ చేసింది. గతంలో ఆయన హీరోగా కె.యస్.రవికుమార్ తీసిన లింగా సినిమా కథ తనదే నంటూ రవిరత్నం అనే వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. దీంతో డైరెక్టర్, ప్రొడ్యూసర్లతో పాటు హీరో రజనీకాంత్ కు కూడా మదురై కోర్టు సమన్లు పంపింది. మద్రాస్ హైకోర్టు లో విచారణకు సమయం పడుతున్నందున, కేసును మదురై కోర్టుకు ట్రాన్స్ ఫర్ చేయాలన్న రవిరత్నం కోరికను హైకోర్టు మన్నించింది. తన కథను అనుమతి లేకుండా వాడుకున్నందుకు తనకు నష్టపరిహారం ఇప్పించాలని కోర్టును రవిరత్నం పిటిషన్లో పేర్కొన్నాడు. మరి లింగా వివాదం ఆయన్ను ఎప్పుడు వదులుతుందో చూడాలి. ప్రస్తుతం కబాలీ షూటింగ్ లో రజినీ బిజీగా ఉన్నారు. దీంతో పాటు ఆయన చిరంజీవి 150వ సినిమాలో కాసేపు కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. కబాలీ తర్వాత, రోబో 2 రజనీ కోసం రెడీగా ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



