రాజుగారూ.. తప్పెక్కడ జరుగుతుందో చూడండి!
on Mar 8, 2016

ఒకప్పుడు దిల్‌రాజు సినిమా అంటే సూపర్ హిట్ గ్యారెంటీ. ఫ్యామిలీ మొత్తాన్ని ధియేటర్లకు తీసుకొచ్చిన చిత్రాలాయనవి. చిన్న సినిమాతో పెద్ద విజయం కొట్టి.. అందరినీ ఆశ్చర్యపరిచేవారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఎంతో నమ్మకం పెట్టుకొన్న సినిమాలన్నీ పల్టీలు కొడుతున్నాయి. గత నాలుగేళ్లలో ఒకట్రెండు విజయాలు తప్ప... దిల్‌రాజు పెద్దగా సాధించిందేం లేదు. తాజాగా కృష్ణాష్టమి కూడా భారీ నష్టాలనే మిగిల్చింది. `నా నుంచి వచ్చిన ప్రతీ ఫ్లాపుకూ బాధ్యత నాదే` అని చెప్పే దిల్‌రాజు - ఈ సినిమానీ తన ఖాతాలోనే వేసుకొన్నాడు. పట్టుకొంటే ప్రతీ సినిమా బంగారమైపోయే పరిస్థితి నుంచి.. చేసిన ప్రతి సినిమా ఫ్లాపయ్యే స్థితికి చేరుకొన్నాడు దిల్‌రాజు.
తన అతి చొరవతో, మితిమీరిన ప్రమేయంతో దర్శకులను తమ పని తాము చేసుకోనివ్వకుండా చూడడమే.. ఈ పరాజయాలకు కారణమన్నది ఇండ్రస్ట్రీ వర్గాల మాట. పైగా ఒక కథని సానబెట్టి సానబెట్టి... ప్రతీ రోజూ ఓ మార్పు చేసుకొంటూ వెళ్లడం వల్ల కథలోని వర్జినల్ ఫీల్ మిస్సవుతోందని దిల్‌రాజుతో పనిచేసిన దర్శకులు చాటుమాటుగావాపోతుంటారు. కృష్ణాష్టమి విషయంలోనూ అదే జరిగిందట. వాసు వర్మ పేరుకు మాత్రమే దర్శకుడని, వెనుక ఉండి నడిపించింది దిల్‌రాజు, సునీల్ ద్వయమని తేలిపోయింది. తన సినిమా విషయంలో నిర్మాతకు కొన్ని ఆలోచనలు ఉండడం సమంజసమే. కానీ దర్శకుడి ఐడియాలజీకే పెద్ద పీట వేయాలని, వాళ్ల పనిని వాళ్లు చేసుకోనివ్వాలని దిల్‌రాజు ఎప్పటికి తెలుసుకొంటాడో??
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



