'తిరగబడర స్వామి' అంటున్న రాజ్ తరుణ్
on Dec 1, 2022

'ఉయ్యాల జంపాల', 'సినిమా చూపిస్త మావ', 'కుమార్ 21F' వంటి వరుస విజయాలతో కెరీర్ ని ఘనంగా ప్రారంభించిన యంగ్ హీరో రాజ్ తరుణ్ కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల 'అహ నా పెళ్ళంట' అనే వెబ్ సిరీస్ తో అలరించిన రాజ్ తరుణ్ ఇప్పుడు 'తిరగబడర స్వామి' అంటున్నాడు.
ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రాజ్ తరుణ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'తిరగబడర స్వామి' అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా నిర్మిస్తున్న ఈ చిత్రం తాజాగా పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు షాట్ కి సి.కళ్యాణ్ క్లాప్ కొట్టగా, కెఎస్ రామారావు కెమెరా స్విచాన్ చేశారు. పోకూరి బాబూరావు స్క్రిప్ట్ ను దర్శకుడు రవికుమార్ కి అందించారు.
జె.బి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జవహర్ రెడ్డి సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. బిగ్ స్క్రీన్ పై రాజ్ తరుణ్ హిట్ చూసి చాలా కాలమైంది. ఈ సినిమాతోనైనా ఆయన సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



