విశ్వక్ సేన్ నటించిన 'ముఖ చిత్రం' వచ్చేస్తోంది
on Dec 1, 2022
వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, అయేషా ఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా 'ముఖ చిత్రం'. గంగాధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ కీలక పాత్రలో అలరించనున్నాడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అంతేకాదు మూవీ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు.
"ఇద్దరి మధ్య జరిగిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎప్పుడైనా చూశావా?" అంటూ 'ముఖ చిత్రం' ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. ప్లాస్టిక్ సర్జరీ కథాంశంతో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ ని బట్టి చూస్తే ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అనిపిస్తోంది. ఇక "కోర్టు గెలుపు.. మెట్లెక్కొచ్చిన ఒక మంచోడిని గెలిపించడంలో లేదు.. ఇంట్లో కూర్చున్న ఒక చెడ్డోడికి కూడా భయాన్ని పుట్టించడంలో ఉంది" అంటూ లాయర్ విశ్వామిత్ర పాత్రలో విశ్వక్ సేన్ ఆకట్టుకున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
పాకెట్ మనీ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కలర్ ఫోటో' దర్శకుడు సందీప్ రాజ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. కాల భైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.