ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఇన్నాళ్లకు రాధే శ్యామ్ అప్డేట్!
on Jul 29, 2021

రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రాధే శ్యామ్'. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ మూవీకి సంబంధించి అప్డేట్స్ పెద్దగా రాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ను అప్ డేట్స్ ఇవ్వమని పదే పదే కోరుతున్నారు. అయితే ఎట్టకేలకు ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వచ్చింది. ఈ సినిమా నుంచి మూడు రోజుల్లో అప్డేట్ ను వదలనున్నట్టు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ట్వీట్ చేశాడు.
'రాధే శ్యామ్' చిత్రీకరణ పూర్తయిదని డైరెక్టర్ రాధాకృష్ణ ట్వీట్ చేశాడు. ఈ ప్యాండమిక్ మీ అందరి అంచనాలను దెబ్బ తీసింది. కానీ ఓ అప్డేట్ ఇంకో మూడు రోజుల్లో మీకోసం రాబోతోందని పేర్కొన్నాడు. దీంతో ఆ అప్డేట్ ఏంటో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కొందరు మాత్రం 'మాకు నమ్మకం లేదు దొర' అంటూ ట్రోల్ చేస్తున్నారు.
కాగా, ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి చేశాడు. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ k లైన్ లో ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



