థియేటర్ల మూసివేత విషయమై మంత్రి పేర్ని నానిని కలిసి నారాయణమూర్తి!
on Dec 30, 2021

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ ధరలపై దుమారం చెలరేగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. దేశంలోని మిగతా ఏ ప్రాంతంలోనూ లేని విధంగా థియేటర్లలో టిక్కెట్లకు అతి తక్కువ ధరలను నిర్ణయిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇది తీవ్ర వివాదాన్ని సృష్టించింది. పలు యాజమాన్యాలు ఆ ధరలకు టిక్కెట్లు అమ్మేట్లయితే థియేటర్లను నడపలేమంటూ వాటిని మూసేస్తున్నారు. రాష్ట్రంలోని పలుచోట్ల ఇలాంటి మూసివేతలు జరుగుతున్నట్లు రిపోర్టులు అందుతున్నాయి. ఇటీవల విడుదలైన 'అఖండ', 'పుష్ప', 'శ్యామ్ సింగ రాయ్' సినిమాల కలెక్షన్లపై ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో 'శ్యామ్ సింగ రాయ్' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల పరిస్థితిని చూస్తుంటే ఏడుపొస్తోందని వ్యాఖ్యానించారు. అటు ప్రభుత్వం, ఇటు చిత్రసీమ పెద్దలు కలిసి కూర్చొని చర్చించి సమస్యను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Also read: ఆంధ్రప్రదేశ్‌లో 'ఆర్ఆర్ఆర్'కు మినహాయింపులు లేవు.. బెంబేలెత్తుతున్న బయ్యర్లు!
ఆ తర్వాత ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలిసి టికెట్ ధరలను పెంచడం, నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారనే అభియోగంతో థియేటర్లను సీజ్ చేస్తున్న వ్యవహారంపై చర్చలు జరిపారు. అతి త్వరలోనే టికెట్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని నాని వారికి హామీ ఇచ్చారు.
Also read: 'అఖండ' టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేసింది!
లేటెస్ట్‌గా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నానిని నారాయణమూర్తి కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల వ్యవహారం, టికెట్ ధరల వ్యవహారంపై నానితో ఆయన చర్చించినట్లు సమాచారం. ప్రేక్షకుడికి అందుబాటులో టికెట్ ధరలు ఉండటం మంచిదే అయినప్పటికీ, భారీ బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలకు టికెట్ ధరలు పెంచుకొనే వెసులుబాటు కల్పించాలనీ, లేనట్లయితే డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, మొత్తంగా ఇండస్ట్రీ సంక్షోభంలో చిక్కుకుంటుందని ఆయన కోరినట్లు తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



