మెగా అల్లుడి 'కిన్నెరసాని' ట్రైలర్ అదిరింది!
on Dec 30, 2021

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ 2018 లో విడుదలైన 'విజేత' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యాడు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కిన్నెరసాని'. రమణతేజ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అన్ షీతల్ హీరోయిన్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
కిన్నెరసాని సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ని బట్టి చూస్తే ఇది వేరు వేరు కాలాలలో జరిగిన కథ అని అర్థమవుతోంది. "నీ ముందు ఉన్న సముద్రపు అలల్ని చూడు. కోపగించుకుని సముద్రాన్ని వదిలి వెళ్లిపోతున్నట్టున్నాయ్. కానీ, సముద్రం వాటిని వదలదు. వదులుకోలేదు. నేను కూడా అంతే" అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. "కారణం లేని ప్రేమ .. గమ్యం లేని ప్రయాణం చాలా గొప్పవి కదా", "ఆగదు ఈ అన్వేషణ ఒక ప్రాణాన్ని తీసేవరకూ" వంటి డైలాగ్స్, మహతి స్వరసాగర్ అందించిన మ్యూజిక్ తో ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించేలా ఉంది.

ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్, శుభం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 26 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



