తెలుగునాట రూ. 60 కోట్ల షేర్ మార్కును చేరుకున్న 'అఖండ'!
on Dec 30, 2021

బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ముచ్చటగా మూడోసారి బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమా మునుపటి సినిమాలు 'సింహా', 'లెజెండ్'ను మించి బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. బాలయ్య కెరీర్‌లోనూ తెలుగునాట రూ. 60 కోట్ల షేర్ మార్కును అందుకున్న తొలి సినిమాగా రికార్డు పుటల్లోకి ఎక్కింది. బాక్సాఫీస్ దగ్గర 'అఖండ' నాలుగు బుధవారంతో నాలుగు వారాలను పూర్తి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 'అఖండ' వసూళ్లు రూ. 70 కోట్ల మార్కును దాటాయి. ఇది కూడా బాలయ్య సినిమాల్లో రికార్డే. ఇప్పటికీ థియేటర్లలో చెప్పుకోదగ్గ షేర్ వస్తుండటం విశేషం.
Also read: 'అఖండ' టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేసింది!
28వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 'అఖండ' రూ. 10 లక్షల షేర్ వసూలు చేసింది. దీంతో కలుపుకొని తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఏరియాల్లో వసూళ్లు రూ. 59.93 కోట్ల షేర్‌కు చేరుకున్నాయి. ఈ రోజుతో రూ. 60 కోట్ల మార్కును సినిమా అందుకుంటోంది. నాలుగు వారాలకు తెలంగాణలో రూ. 19.87 కోట్ల షేర్ వసూలు చేసిన 'అఖండ', ఆంధ్ర ఏరియాలో రూ. 25.03 కోట్లను, రాయలసీమలో రూ. 15.04 కోట్లను రాబట్టింది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.68 కోట్లు వసూలయ్యాయి.
Also read: యూఎస్ టాప్ గ్రాసర్స్ లిస్టులో 'పుష్ప'!
'అఖండ' ప్రి బిజినెస్ విలువ రూ. 53 కోట్లు కాగా, ఇప్పటివరకూ రూ. 70.61 కోట్లు వచ్చాయి. అంటే రూ. 17.61 కోట్ల లాభాన్ని బయ్యర్లు చవిచూశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



