తెలుగు రాష్ట్రాల్లో రూ. 101 కోట్లు.. 'పుష్ప' బిజినెస్ క్రేజ్!
on Dec 15, 2021

అల్లు అర్జున్ టైటిల్ పాత్ర పోషించగా సుకుమార్ డైరెక్ట్ 'పుష్ప' మూవీ ఈనెల 17న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలవుతోంది. తెలుగు ఒరిజినల్ వెర్షన్‌తో పాటు పాన్ ఇండియా ఫిల్మ్‌గా హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా, మలయాళం స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటించిన ఈ మూవీకి ట్రేడ్ వర్గాల్లో అసాధారణ క్రేజ్ ఏర్పడింది. దానికి తగ్గట్లే ప్రి బిజినెస్ కూడా అనూహ్య స్థాయిలో జరిగింది.
పాండమిక్ టైమ్‌లో బన్నీ సినిమాకు వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ. 145 కోట్ల వ్యాపారం జరగడం విశేషంగా చెప్పుకుంటున్నారు. 'అల వైకుంఠపురములో' బ్లాక్‌బస్టర్‌తో బన్నీ, 'రంగస్థలం' బ్లాక్‌బస్టర్‌తో సుకుమార్ కెరీర్‌లో పీక్‌లో ఉండటంతో, అందుకు అనుగుణంగా 'పుష్ప' క్రేజ్ పరాకాష్ఠకు చేరుకుంది. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో 'పుష్ప'కు రూ. 101. 75 కోట్ల మేర ప్రి బిజినెస్ జరిగింది.
తెలంగాణలో రూ. 36 కోట్లు, ఆంధ్రాలో రూ. 47.75 కోట్లు, రాయలసీమలో రూ. 18 కోట్లకు ఈ సినిమాను బయ్యర్లు కొనుగోలు చేశారు. దేశంలోని మిగతా ప్రాంతాలు చూసుకుంటే తమిళనాడులో రూ. 6 కోట్లు, కర్ణాటకలో రూ. 9 కోట్లు, కేరళంలో రూ. 4 కోట్లు, హిందీ బెల్ట్‌లో రూ. 10 కోట్లు, ఇతర ప్రాంతాల్లో రూ. 1.15 కోట్లకు 'పుష్ప' బిజినెస్ జరిగింది. అలాగే ఓవర్సీస్‌లో రూ. 13 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని కొన్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా రూ. 144.9 కోట్లకు ఈ సినిమా అమ్ముడుపోయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



