ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా మూవీలో అర్చన!
on Dec 15, 2021

వివాహానంతరం కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న అర్చన అలియాస్ వేద తిరిగి కెరీర్ మీద దృష్టి పెట్టింది. కన్నడంలో 'డీటీఎస్' (డేర్ టు స్లీప్) అనే సినిమాలో కీలక పాత్రను చేస్తోంది. అభిరామ్ పిళ్లా డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో చేతన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగులోనూ విడుదల కానున్నది. 14 సంవత్సరాల తర్వాత అర్చన, చేతన్ కలిసి నటిస్తున్నారు. చివరగా వారు 'ఆ దినగళు' సినిమాలో కలిసి నటించారు.
దీనిపై చేతన్ మాట్లాడుతూ, "అర్చనతో షూటింగ్‌లో పాల్గొనడం థ్రిల్‌గా ఫీలవుతున్నాను. నా కెరీర్‌కు బిగ్ బ్రేక్ ఇచ్చిన 'ఆ దినగళు' మూవీలో చేశాక, ఇప్పుడు ఆమెతో చేస్తుండటం నోస్టాల్జిక్ ఫీలింగ్‌ను ఇస్తోంది. ఇన్నేళ్ల తర్వాత కలిసినా, ఆమె అలాగే ఉంది. 'డీటీఎస్'లో ఆమె పవర్ఫుల్ కేరక్టర్ చేస్తోంది. తెరపై మా కాంబినేషన్‌ను మరోసారి ప్రేక్షకులు ఇష్టపడతారని కచ్చితంగా చెప్పగలను" అన్నాడు.
ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా నేపథ్యంతో నడిచే ఈ మూవీలో డోనాల్ బిష్త్, నటాషా సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'సర్దార్ గబ్బర్‌సింగ్', 'డిక్టేటర్' సినిమాల ఫేమ్ కబీర్ దుహాన్ సింగ్ విలన్‌గా కనిపించనున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



