జులాయి తరువాత మళ్ళీ పుష్పనే..
on Jan 28, 2021

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో జులాయి ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్.. అప్పట్లో వరుస పరాజయాల్లో ఉన్న బన్నీని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చింది. నటుడిగా తన స్థాయిని మరింత పెంచింది. 2012 ఆగస్టు 9న జులాయి జనం ముందుకు వచ్చింది. ఆ సినిమాకి ముందుగానీ, తరువాత గానీ మళ్ళీ బన్నీ చిత్రమేది ఆగస్టు నెలలో సందడి చేసిన సందర్భం లేదు.
కట్ చేస్తే.. అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ తరువాత బన్నీ నటిస్తున్న పుష్ప చిత్రం.. ఇప్పుడదే నెల ప్రథమార్ధంలో (ఆగస్టు 13) థియేటర్స్ లో సందడి చేయనుంది. మరి.. జులాయి మ్యాజిక్ పుష్పకి కూడా కొనసాగి మరో బ్లాక్ బస్టర్ మూవీ అల్లు అర్జున్ ఖాతాలో చేరుతుందేమో చూడాలి.
కాగా, పుష్పని బన్నీ లక్కీ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండగా.. రష్మిక మందన్న నాయికగా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



