ఓటీటీ బాటలో సైనా నెహ్వాల్ బయోపిక్
on Jan 28, 2021

ఒకవైపు థియేటర్స్ రీ-ఓపెన్ అయినా.. మరోవైపు ఓటీటీ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. 50 శాతం ఆక్యూపెన్సీతో, సరిగ్గా థియేటర్స్ దొరక్క ఇబ్బందులు పడడం కంటే ఓటీటీలో రిలీజ్ చేసుకోవడమే బెటర్ అని ఫీలవుతున్నారు కొంతమంది మేకర్స్. ఈ నేపథ్యంలోనే.. ఓ ఆసక్తికరమైన బయోపిక్ ఓటీటీ బాటలో వెళుతోంది. అదే.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సైనా. టాలెంటెడ్ బ్యూటీ పరిణీతి చోప్రా టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాని తొలుత గత ఏడాది వేసవిలోనే విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావించారు. అయితే కరోనా కారణంగా వాయిదా తప్పలేదు.
ఇప్పుడు థియేటర్స్ మళ్ళీ తెరుచుకున్నా.. 50 శాతం ఆక్యుపెన్సీతో రిలీజ్ చేసే విషయంలో పునరాలోచనలో పడ్డారట మేకర్స్. త్వరలోనే సైనా ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుంది.
సైనా పాత్ర కోసం పరిణీతి చాలానే శ్రమించింది. మరి.. తన శ్రమకు తగిన గుర్తింపు దక్కుతుందో లేదో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



