అప్పుడు రచ్చ.. ఇప్పుడు సీటీమార్..
on Jan 28, 2021

యువ దర్శకుడు సంపత్ నంది కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీ.. రచ్చ. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా నాయిక కాగా.. మెలోడీబ్రహ్మ మణిశర్మ బాణీలు అందించారు. మిశ్రమ స్పందన వచ్చినా.. ఈ చిత్రం అప్పట్లో భారీ వసూళ్ళు సాధించి ఆశ్చర్యపరిచింది. కట్ చేస్తే.. దాదాపు తొమ్మిదేళ్ళ తరువాత సంపత్ - మణిశర్మ - తమన్నా ఈ ముగ్గురి కాంబినేషన్ లో మరో సినిమా వస్తోంది. అదే.. సీటీమార్.
యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న ఈ సినిమాని ఏప్రిల్ 2న రిలీజ్ చేయబోతున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. సంపత్ - మణిశర్మ - తమన్నా కాంబోలో వచ్చిన తొలి చిత్రం రచ్చ కూడా ఇదే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో (ఏప్రిల్ 5) రిలీజై ఘనవిజయం సాధించింది. మరి.. ఆ మ్యాజిక్ రిపీట్ అయి సీటీమార్ తో సంపత్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.
కాగా, సీటీమార్ లో సీనియర్ హీరోయిన్ భూమికా చావ్లా ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



