'పుష్ప-2' నుంచి బిగ్ సర్ ప్రైజ్!
on Oct 17, 2022

'బాహుబలి' ఫ్రాంచైజ్, 'కేజీఎఫ్' ఫ్రాంచైజ్ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆ స్థాయిలో రెండో భాగం కోసం ఎదురు చూస్తున్న సినిమా 'పుష్ప: ది రూల్'. గతేడాది డిసెంబర్ లో విడుదలైన మొదటి భాగం 'పుష్ప: ది రైజ్' సంచలన విజయాన్ని అందుకుంది. 'తగ్గేదేలే' అంటూ దేశవ్యాప్తంగా పుష్ప క్రేజ్ కనిపించింది. దీంతో ఇప్పుడు పార్ట్-2 పై అందరి దృష్టి పడింది. ఇదిలా ఉంటే ఈ దీపావళికి మూవీ టీమ్ ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పెరిగిన అంచనాల దృష్ట్యా 'పుష్ప-2'ని భారీస్థాయిలో రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్యాంకాక్, శ్రీలంక లోని అడవుల్లో షూటింగ్ జరిగే అవకాశముంది. ఇదిలా ఉంటే నూతనంగా నిర్మించిన అల్లు స్టూడియోస్ బన్నీ ఫోటో షూట్ జరిగినట్టు తెలుస్తోంది. దీపావళికి ఓ సర్ ప్రైజ్ పోస్టర్ ని రిలీజ్ చేయడం కోసం ఈ ఫోటో షూట్ చేసినట్టు సమాచారం. ఈ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



