డిసెంబర్‌లో 'దేశముదురు' హీరోయిన్ హన్సిక పెళ్లి ఇక్కడే.. వరుడెవరు?
on Oct 17, 2022

అందాల తార హన్సిక మొదట హిందీ టీవీ సీరియల్స్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. తర్వాత హృతిక్ రోషన్ సినిమా 'కోయీ మిల్ గయా'లో నటించి, అల్లు అర్జున్ సరసన నటించిన 'దేశముదురు' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోటే తన అందచందాలు, హావభావాలతో ఆకట్టుకుంది. చాలా త్వరగా తెలుగు, తమిళ చిత్ర సీమల్లో పాపులర్ హీరోయిన్ అయిపోయింది. ఇవాళ ఆమెకు భారీ సంఖ్యలో అభిమానులున్నారు. కాగా, త్వరలో ఆమె వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టనుందనే వార్త బయటకు పొక్కడంతో, వారంతో సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, శుభాభినందనలు తెలియజేస్తున్నారు. హన్సిక పెళ్లి పనులు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయని హిందీ టాబ్లాయిడ్లు రాస్తున్నాయి.
ఇండియా టీవీ రిపోర్ట్ ప్రకారం, ఈ ఏడాది డిసెంబర్‌లో హన్సిక పెళ్లి జరగబోతోంది. వింటేజ్ టచ్‌తో పెళ్లి చేసుకోవాలని ఆమె కోరుకుంటోందట. అందుకని, జైపూర్‌లోని 450 సంవత్సరాల పురాతన ముందోట కోటను వేదికగా ఎంచుకుందట. డిసెంబర్‌లో ఏ తేదీన ఆమె పెళ్లి జరగనున్నదనే విషయం బయటకు రాలేదు కానీ, వేదికను పెళ్లి కోసం అలంకరిస్తున్నారని ఆ రిపోర్టులో వెల్లడించారు. డిసెంబర్‌లో జరిగే హన్సికా మొత్వానీ పెళ్లి కోసమే ముందోట కోటను ముస్తాబు చేస్తున్నట్లు అక్కడి సిబ్బంది తెలియజేశారంట కూడా.
ఇంతకీ, హన్సిక ఎవరిని పెళ్లాడబోతోంది? ఇదే.. ఇప్పుడు అందరిలోనూ అమితమైన కుతూహలాన్ని రేకెత్తిస్తోన్న ప్రశ్న. ఆమెది లవ్ మ్యారేజా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా?.. ఈ విషయం ఇంతదాకా వెల్లడి కాలేదు. ఆమధ్య శింబుతో ఆమె ప్రేమలో ఉందనే ప్రచారం జోరుగా సాగింది. తర్వాత ఆ ఇద్దరూ బ్రేకప్ అయ్యారని కూడా మనం చదివాం. మరిప్పుడు హన్సిక మనసు దోచిన ఆ వరుడెవరు? అనేది అతి త్వరలోనే తెలియనున్నది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



