అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా నన్ను ప్రేమించారు!
on Oct 18, 2022
.webp)
అనితా చౌదరి.. ఈ పేరు తెలియని వారే ఉండరు. ఎందుకంటే ఒకప్పటి బుల్లితెర "కస్తూరి" గా ఈమె ఫుల్ పాపులర్ నటిగా పేరు తెచ్చుకుంది. ఆ సీరియల్ సాంగ్ కి కావొచ్చు, అనిత అందానికి కావొచ్చు.. అప్పట్లో చాలామంది ఫాన్స్ ఉండేవాళ్ళు. ఇప్పటికీ ఈ సీరియల్ గురించి ఇళ్లల్లో చెప్పుకుంటూ వుంటారు. అనిత చౌదరి నటించిన 'కస్తూరి' సీరియల్ టైంలో జరిగిన కొన్ని ఫన్నీ విషయాలను తెలుగువన్ చానల్ కోసం చేసిన ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు.
"ఈ సీరియల్ వచ్చే టైంలో అమ్మాయిలు, అబ్బాయిలు కూడా నన్ను బాగా ఇష్టపడేవాళ్లు. నా ప్రేమలో కూడా పడ్డారు. ఈ సీరియల్ కి అప్పుడేంటి ఇప్పటికీ ఫాన్స్ ఉన్నారు. ఇక చాలామంది ఉత్తరాలు రాసేవాళ్ళు. టన్నుల కొద్దీ వచ్చేవి. అప్పట్లో సోషల్ మీడియా లేదు కదా. ఆ ఉత్తరాలు చదుకునేదాన్ని. 12 గంటలకు మీ సీరియల్ వస్తే ఎట్లా? ఇంట్లో మాకు భోజనాలు కూడా పెట్టడం లేదని చాలా మంది మగవాళ్ళు కూడా కంప్లైంట్స్ చేస్తూ ఉత్తరాలు రాసేవారు. ఆడియన్స్ అభిమానం కంటే మరో అవార్డు అనేది లేదు. 'నాన్న', 'అమృతం' వంటి సీరియల్స్ కూడా చేసాను. అని ఆమె చెప్పారు.
సుమ, ఉదయభాను, ఝాన్సీ, సునీత, శిల్ప చక్రవర్తి , నేను అందరం పోటీగా చేసేవాళ్ళమని ఆమె అన్నారు. అందుకే మమ్మల్ని ఫస్ట్ జనరేషన్ యాంకర్స్ అనేవాళ్ళు. ఇక మాతో పాటు హర్షవర్ధన్, సమీర్, రాజీవ్ కనకాల, ప్రీతి నిగమ్, శృతి వాళ్లంతా ఒక టైంలో నాకు మెంటార్స్ లా ఎంతో హెల్ప్ చేశారు. అప్పట్లో జెమినీ టీవీలో ఒక క్విజ్ షో వచ్చేది. అందులో నేను స్కోరర్ గా ఉండేదాన్ని. ఇక ఈటీవీలో సినిమా క్విజ్ షోని నేను, బ్రహ్మానందం గారు కలిసి చేసేవాళ్ళం. బ్రహ్మానందం గారు చాలా భయపడేవారు యాంకరింగ్ చేయడానికి. ఎందుకంటే యాంకరింగ్ చేయడం చాలా కష్టం." అని అనిత ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు.
"ఛత్రపతి" మూవీలో "సూరీడు.. ఓ సూరీడు" అంటూ అనితా చౌదరి చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. 16ఏళ్లకే కెరీర్ స్టార్ట్ చేసి, ఈటీవీ, మాటీవీ, జీ తెలుగు.. ఇలా అన్ని చానల్స్ లో వచ్చే ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా చేయడమే కాదు, మూవీస్ లో కూడా ఆర్టిస్ట్ గా చేసి ఒక ట్రెండ్ సెట్ చేశారు అనిత చౌదరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



