లక్కీ సీజన్‌పై కన్నేసిన సుకుమార్
on May 6, 2020

రాశి కంటే వాసికే ప్రాధాన్యమిచ్చే దర్శకుల్లో బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ఒకరు. అందుకే ఈ మాజీ లెక్కల మాస్టారి సినిమాల లెక్క పరిమితంగానే ఉంటుంది. రెండు మూడేళ్ళకో సినిమా అన్నట్లుగా తన చిత్రప్రయాణం సాగుతూ ఉంటుంది. 2004లో రిలీజైన ‘ఆర్య’తో మొదలైన సుక్కు దర్శక ప్రస్థానం 2018లో విడుదలైన ‘రంగస్థలం’తో ఏడు సినిమాల మజిలీకి చేరుకుంది. కాగా 2019, 2020ని 'జీరో రిలీజ్ ఇయర్స్'గా సరిపెట్టేశాడీ ‘ఆర్య’ డైరెక్టర్.
ప్రస్తుతం తన లక్కీ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో తన ఎనిమిదవ చిత్రం ‘పుష్ప’ చేస్తున్నాడు సుక్కు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంతో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రష్మికా మందన్న నాయికగా నటిస్తోంది. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి చిత్రీకరణకు వెళ్ళే తరుణంలో కరోనా వైరస్ కారణంగా బ్రేక్ పడింది. లాక్ డౌన్ పిరియడ్ ముగిసిన తరువాత ‘పుష్ప’ షెడ్యూల్ ప్రారంభం కానుంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరాకి రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేసింది. అయితే అనివార్య కారణాల వల్ల 2021 వేసవికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా పడిందన్నది ఇన్‌సైడ్ టాక్. అదేగనుక నిజమైతే.. సుక్కు తన లక్కీ సీజన్‌ని మరోసారి టార్గెట్ చేసుకున్నట్టే.
ఎందుకంటే.. సమ్మర్‌లో రిలీజైన సుక్కు ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ బాట పట్టింది. ‘ఆర్య’(2004), ‘100% లవ్’(2011), ‘రంగస్థలం’(2018).. ఇలా సుక్కు ఖాతాలో ఉన్న ప్రతీ సాలిడ్ హిట్ మూవీ సమ్మర్ రిలీజ్‌నే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో.. ‘పుష్ప’ కూడా ఆ హిట్ చిత్రాల సరసన చేరుతుందేమో చూడాలి.
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



