కియారా... బన్‌గయా బడా షెఫ్!
on May 6, 2020

మహేష్‌బాబుకు జోడీగా ‘భరత్ అనే నేను’, రామ్‌చరణ్‌కు జంటగా ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో కథానాయికగా నటించిన కియారా అద్వానీ గుర్తుందా? ఈమధ్య నాలుగైదేళ్లలో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన కథానాయికలలో ఆమె పేరు తప్పకుండా ఉంటుంది. ఇప్పుడీమె కిచెన్‌లో పుల్ బిజీ. లాక్‌డౌన్‌లో ఫ్రీ టైమ్ ఎక్కువ దొరకడంతో ఫుల్లుగా వంటలు నేర్చుకుంటోంది. నేర్చుకోవడమే కాదు... ‘మీకు ఏం వండాలో చెప్పండి. చిటికెలో వండి పెడతా’ అని చెబుతోంది. ఇండియన్ వంటకాలలో ఏ వంట చేయమన్నా చేయడానికి రెడీ అంటోంది. అంతలా వంటలు చేయడం ప్రాక్టీస్ చేశారట. ఇంతకు ముందు వంట చేయాలనుకున్నప్పటికీ టైమ్ కుదరలేదనీ, ఇప్పుడు కుదరడంతో ఫుల్లుగా చేశానని కియారా అద్వానీ చెప్పింది.
హిందీలోనూ ‘కబీర్ సింగ్’, అంతకు ముందు ‘లస్ట్ స్టోరీస్’, ‘ఎంఎస్ ధోనీ’ సినిమాలతో కియారా అద్వానీ నటించారు. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగైదు హిందీ సినిమాలు ఉన్నాయి. లాక్‌డౌన్ తీసేసిన తర్వాత షూటింగులు మొదలవుతాయి కాబట్టి అన్నీ తినడం లేదనీ, తినేస్తే లావు అయిపోతానని జాగ్రత్తగా ఉంటున్నాననీ కియారా అద్వానీ వివరించింది. ప్రస్తుతం అయితే ఫ్యామిలీతో ఫుల్ టైమ్ స్పెండ్ చేస్తున్నానని సెలవిచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



