ప్రియాంకను కలర్ తక్కువన్నారు!
on Nov 21, 2020

ప్రియాంక చోప్రా కెరీర్ హాలీవుడ్‌లో మంచి స్వింగ్‌లో ఉంది. బాలీవుడ్‌లో తానేమిటో నిరూపించుకొని, హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్న ఏకైక తారగా ఆమె పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో 'ది వైట్ టైగర్' మూవీతో పాటు హాలీవుడ్‌లో వియ్ కెన్ బి హీరోస్, ద మ్యాట్రిక్స్ 4, టెక్ట్స్ ఫర్ యు సినిమాల్లో నటిస్తోంది.
ఇప్పుడైతే బాగా ఉంది కానీ.. కెరీర్‌లో వచ్చిన కొత్తలో కలర్ తక్కువనీ, అసలు హీరోయిన్‌గా సరిపోవు అనీ కొందరు అన్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ప్రియాంక. "ఇండస్ట్రీకి వచ్చిన రోజుల్లో అసలు మేకప్ ఎలా వేసుకోవాలో తెలిసేది కాదు. కొన్నేళ్ల తర్వాత కానీ నా లుక్‌ను చేంజ్ చేసుకోలేకపోయాను" అంటూ ఆమె తెలిపింది.
"ఎవరో ఏదో అన్నారని ఆగి ఉంటే, ఇక్కడి దాకా వచ్చేదాన్ని కాదు. హీరోయిన్‌గా పనికిరావన్నారని బాధపడలేదు. ముందుకు వెళ్లాను. ఇన్నేళ్ల తర్వాత కూడా హీరోయిన్‌గా చేస్తున్నాను" అని అంటోందీ అమ్మడు. తనలోని కాన్ఫిడెన్సే తనను ఇంతదాకా తీసుకొచ్చిందనేది ప్రియాంక మాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



