నాని-వివేక్ ఆత్రేయ కాంబో ఫిల్మ్ టైటిల్ 'అంటే.. సుందరానికీ!'
on Nov 21, 2020

ఒక యాక్టర్‌గా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నప్పటికీ, పక్కింటబ్బాయి తరహా పాత్రలతో నేచురల్ స్టార్ నాని ప్రేక్షకుల్లో అమితమైన ఆదరాభిమానాలను సంపాదించుకున్నాడు. లేటెస్ట్‌గా ప్రతిభావంతుడైన దర్శకుడు వివేక్ ఆత్రేయతో ఆయన ఓ చిత్రాన్ని చేసేందుకు రెడీ అవుతున్నాడు. పేరుపొందిన నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఫ్యామిలీ ఆడియెన్స్‌లో నానికి ఉన్న ఆదరాభిమానాలకు తగ్గట్లుగా #నాని28 చిత్రానికి 'అంటే.. సుందరానికీ!' అనే ఆసక్తికర టైటిల్ ఖరారు చేశారు. ఒరిజినల్ స్టోరీతో మ్యూజికల్ రొమ్-కామ్‌గా ఈ సినిమా రూపొందుతోంది.
టైటిల్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన వీడియో క్రేజీగా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆ వీడియోలో నాని పోషిస్తున్న సుందరం పాత్ర గురించి జనం రకరకాలుగా గుసగుసలాడటం వినిపిస్తోంది. టైటిల్ లోగో కనిపించే సమయానికి నాని సంప్రదాయ పంచెకట్టుతో ప్రత్యక్షమవడం, ఎక్కడికో ప్రయాణం కట్టినట్లుగా ట్రావెలింగ్ బ్యాగ్‌ను పట్టుకొని ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. చివరలో శకుని పాత్ర తరహాలో ఒక గొంతు "సుందరా.. పాచికలు వేయమందువా?" అనడిగితే సుందరం నవ్వుతూ సరేనన్నట్లు చెప్పడం గమనిస్తే ఈ మూవీలో హిలేరియస్ సీన్స్‌కు కొదవ ఉండదని అర్థమవుతుంది.
నాని సరసన నాయికగా నటిస్తుండటం ద్వారా మలయాళం తార నజ్రియా ఫహాద్ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. వివేక్ ఆత్రేయ మునుపటి చిత్రాలకు ఇంప్రెసిప్ మ్యూజిక్ అందించిన వివేక్ సాగర్ ఈ చిత్రానికీ స్వరాలు కూరుస్తుండగా, రవితేజ గిరిజాల ఎడిటర్‌గా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానున్న 'అంటే.. సుందరానికీ!' సినిమా 2021లో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచనుందనేది స్పష్టం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



