'సలార్'లో మలయాళం స్టార్ పృథ్వీరాజ్
on Mar 9, 2022

'రాధే శ్యామ్' మూవీ ఈ నెల 11న విడుదలవుతుండటంతో, దాని ప్రమోషన్స్ నిమిత్తం దేశమంతా చక్కర్లు కొడుతున్నాడు ప్రభాస్. కేరళలో లేటెస్ట్‌గా జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మలయాళం స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ 'సలార్' మూవీలో నటిస్తున్నట్లు వెల్లడించాడు. పృథ్వీరాజ్‌ను 'సార్' అని ఆయన సంబోధించాడు. "పృథ్వీరాజ్ సార్ కూడా ఆ సినిమా చేస్తున్నారు. ఆయన చేస్తుండటంతో మేం చాలా లక్కీ. అందులో భాగం కావడానికి అంగీకరించినందుకు మేం చాలా హ్యాపీగా ఉన్నాం" అని ప్రభాస్ చెప్పాడు.
ఇంతదాకా ఎప్పుడూ కనిపించని అవతారంలో 'సలార్'లో ప్రభాస్ కనిపిస్తాడని ఇదివరకే మేకర్స్ తెలిపారు. గతంలో, "ఇది చాలా ఎగ్జయిటింగ్ ఫిల్మ్. నా క్యారెక్టర్ చాలా వయొలెంట్‌గా ఉంటుంది. ఇంతదాకా ఈ తరహా క్యారెక్టర్ నేను చేయలేదు. అది పాన్-ఇండియా ఫిల్మ్. సెట్స్ పైకి వెళ్లేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను" అని ప్రభాస్ చెప్పాడు.
ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న 'సలార్' రెండు భాగాలుగా రిలీజవుతోందని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 14న ఈ సినిమా వస్తుందని గతంలో నిర్మాతలు అనౌన్స్ చేశారు. అయితే కొవిడ్ మహమ్మారి కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. సందర్భవశాత్తూ ఏప్రిల్ 14న ప్రశాంత్ లేటెస్ట్ ఫిల్మ్ 'కేజీఎఫ్ చాప్టర్ 2' రిలీజవుతోంది.
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'రాధే శ్యామ్' మూవీని 1970ల నాటి యూరప్ నేపథ్యంలో నడిచే అందమైన ప్రేమకథగా రాధాకృష్ణ కుమార్ రూపొందించాడు. ఇందులో భాగ్యశ్రీ, సచిన్ ఖెడేకర్, కృష్ణంరాజు, ప్రియదర్శి, మురళీశర్మ, కునాల్ రాయ్ కపూర్, రిద్ధి కుమార్, సత్యన్, సాషా చెత్రి కీలక పాత్రధారులు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



