మరో క్రేజీ ప్రాజెక్ట్ లో రష్మిక.. విజయ్ తో తగ్గేదేలే
on Mar 9, 2022

తక్కువ సినిమాలతోనే నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న.. పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్'లో శ్రీవల్లిగా మెప్పించి తన క్రేజ్ ని మరింత పెంచుకుంది. ప్రస్తుతం 'పుష్ప పార్ట్-2'తో పాటు బాలీవుడ్ సినిమాలు చేస్తున్న ఈ కన్నడ బ్యూటీ మరో క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఆఫర్ దక్కించుకుంది.
కొంతకాలంగా కోలీవుడ్ హీరోలు, డైరెక్టర్ లు టాలీవుడ్ వైపు చూస్తున్నారు. తెలుగు హీరోలు రామ్ చరణ్ తో డైరెక్టర్ శంకర్, రామ్ తో డైరెక్టర్ లింగుస్వామి సినిమాలు చేస్తుండగా.. తమిళ్ హీరోలు విజయ్, ధనుష్, శివ కార్తికేయన్ టాలీవుడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా తన 66 వ సినిమాని టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించనుందని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. అయితే మేకర్స్ ఆమెనే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుందని సమాచారం.
ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2 న ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని వార్తలొస్తున్నాయి. ముందుగా చెన్నై లోని గోకులం స్టూడియోస్ లో విజయ్, రష్మిక లపై పాట చిత్రీకరణ జరగనుందని తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



