డేట్ మారింది.. దీపావళికి వస్తున్న 'ప్రిన్స్'
on Jun 21, 2022

'జాతి రత్నాలు' సినిమాతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కేవీ అనుదీప్. కొత్త తరహా కామెడీతో నవ్వులు పూయించిన అనుదీప్.. తన తదుపరి సినిమాని కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. శివ కార్తికేయన్ కెరీర్ లో 20వ సినిమాగా రానున్న ఈ చిత్రానికి 'ప్రిన్స్' అనే టైటిల్ పెట్టారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'ప్రిన్స్' సినిమాని వినాయక చవితి కానుకగా ఆగష్టు 31న విడుదల చేస్తున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ మారింది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్లు ఒక వీడియో ద్వారా తెలియజేశారు. అందులో శివ కార్తికేయన్, సత్యరాజ్, మరియాతో కలిసి నవ్వులు పూయించాడు అనుదీప్. దీపావళికి వస్తుందని తెలిపారు గానీ, తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అక్టోబర్ 21 లేదా 25 తేదీలలో విడుదలయ్యే అవకాశముంది.
ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో ఉక్రెయిన్ బ్యూటీ మరియా హీరోయిన్ గా నటిస్తుండగా, సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



