వరుస సినిమాలతో కిరణ్ అబ్బవరం బిజీబిజీ
on Jun 21, 2022

కిరణ్ అబ్బవరం ఇప్పుడు కాస్త ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఈయన నటించిన సమ్మతమే మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ జూన్ 24 న వరల్డ్ వైడ్ రీలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. కిరణ్ అబ్బవరం ఇప్పటికే 4 సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు. రాజా వారు రాణి వారు, సెబాస్టియన్, ఎస్సార్ కల్యాణమండపం ఇప్పుడు సమ్మతమే ఈ మూవీస్ లో యాక్ట్ చేసాడు. సమ్మతమే మూవీ స్క్రిప్ట్ చాలా పకడ్బందీగా తయారు చేశారట. ఇల్లాంటి పాయింట్ మీద ఇప్పటివరకు ఎవరూ మూవీ తియ్యలేదని చెప్పుకొచ్చాడు కిరణ్. ఇక తర్వాత కోడి రామకృష్ణ బ్యానర్ లో "నేను మీకు బాగా కావాల్సినవాడిని " మూవీలో హీరోగా చేస్తున్నాడు. కోడి రామకృష్ణ మొదటి కూతురు దివ్య దీప్తి నిర్మాతగా కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ మూవీని తీసుకొస్తున్నారు. ఈ మూవీకి కార్తిక్ శంకర్ డైరెక్షన్ చేస్తున్నారు. ఈ మూవీతోనే శంకర్ పరిచయం కాబోతున్నాడు.
ఇక మణిశర్మ సంగీతాన్ని అందించారు. సెప్టెంబర్ ఎండింగ్ లో "వినరో భాగ్యము విష్ణు కథ" అనే సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ పై రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట. తర్వాత మైత్రి మూవీ మేకర్స్, ఏఎం రత్నం బ్యానర్ లో రూల్స్ రంజన్ అనే ఒక మూవీ చేస్తున్నాడట కిరణ్. ఇవి కాక ఇంకో టు మూవీస్ కూడా చేస్తున్నట్లు చెప్పాడు . అంటే 2023 చివరి వరకు చేతినిండా మూవీస్ తో బిజీ ఐపోయాడు కిరణ్ అబ్బవరం. టాలీవుడ్ యంగ్ హీరో అబ్బవరం కిరణ్ నటించింది చాలా కొద్ది సినిమాలే. ఐనా తన ప్రతిభను చాటుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. యాక్టింగ్ స్కిల్స్ చాలా పుష్కలంగా ఉన్నాయి అతనిలో...కిరణ్ నటిస్తున్న "రూల్స్ రంజన్ " మూవీ ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



