'మేజర్' బ్యూటీతో చైతన్య డేటింగ్.. సమంత షాకింగ్ కామెంట్స్!
on Jun 21, 2022

గతేడాది సమంతతో విడాకులు తీసుకున్న నాగ చైతన్య ప్రస్తుతం ఓ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దీంతో చైతన్య మళ్ళీ పెళ్ళికి రెడీ అవుతున్నాడా అంటూ చర్చలు మొదలయ్యాయి.
సమంతను ప్రేమించి 2017 లో పెళ్లి చేసుకున్న చైతన్య అనూహ్యంగా ఆమె నుంచి విడిపోతున్నట్లు 2021, అక్టోబర్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరి విడాకులకు కారణమేంటో ఇప్పటికీ మనకు స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం ఇద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉంటూ ఎవరి లైఫ్ వాళ్ళు బ్రతుకున్నారు. అయితే ఇప్పుడు చైతన్య రెండో పెళ్ళికి సంబంధించిన చర్చ తెరమీదకు వచ్చింది.
ఇటీవల 'మేజర్' సినిమాతో ఆకట్టుకున్న శోభిత దూళిపాళ్లతో చైతన్య డేటింగ్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. మేజర్ ప్రమోషన్స్ సమయంలో శోభిత బస చేసిన హోటల్ దగ్గర చైతన్య కనిపించాడని, అలాగే చైతన్య ఇంటికి కూడా శోభిత వెళ్లిందని న్యూస్ వినిపిస్తోంది. ఇటీవల ఆమె బర్త్ డే కూడా చైతన్య సెలెబ్రేట్ చేసినట్లు టాక్.
.webp)
అయితే చైతన్య పై వస్తున్న డేటింగ్ రూమర్స్ వెనుక సమంత టీమ్ హస్తముందని, చైతన్యను బ్యాడ్ చేసేందుకు కావాలనే ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని కొందరు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా సమంత స్ట్రాంగ్ గా స్పందించింది. "అమ్మాయిపై రూమర్స్ వస్తే నిజమే అయ్యుంటుంది అంటారు. అబ్బాయిపై వస్తే మాత్రం అమ్మాయి పని అయ్యుంటుంది అంటారు. కాస్త ఎదగండి. మేం అన్ని మర్చిపోయి మా పని మేం చూసుకుంటున్నాం. మీరు కూడా మీ పని మీరు చూసుకోండి. మీ కుటుంబం గురించి ఆలోచించండి" అంటూ ట్వీట్ చేసింది సమంత.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



