ప్రతాప రుద్రుడు సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు..!
on Jun 1, 2016

తన కలల సినిమా రుద్రమదేవిని సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించేశాడు గుణశేఖర్. దాదాపు 70 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టి భారీ స్థాయిలో సినిమాను నిర్మించాడు. ఆ తర్వాత రుద్రమదేవి పార్ట్ 2 గా ప్రతాప రుద్రుడు తెరకెక్కుతుందని ప్రకటించినా, అది ఏమైంది అన్నది ఇప్పటి వరకూ ఎవరికీ తెలియలేదు. ఇక ఈ సినిమా సైడ్ అయిపోయిందేమో అని అందరూ అనుకుంటున్న సమయంలో, ఆ సినిమా ఆగదని స్పష్టం చేస్తున్నాడు గుణశేఖర్. అయితే అతనే నిర్మాతగా వ్యవహరించడమనేది మాత్రం డౌట్ గానే మారింది. సినిమా స్క్రిప్ట్ ఫైనల్ అయిపోతే నిర్మించడానికి తాను రెడీగా ఉన్నానని దిల్ రాజు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో సినిమా ప్రీప్రొడక్షన్ పై దృష్టి పెట్టాడట గుణ. ప్రస్తుతం తన టీం ప్రతాపరుద్రుడి చరిత్రను రీసెర్చ్ చేస్తున్నారని, పూర్తిగా చరిత్ర తెలుసుకున్న తర్వాతే సినిమాకు కథ ఇవ్వాలనుకుంటున్నానని చెబుతున్నాడు.. కథ కూడా పక్కా అయిన తర్వాత మూవీ షూటింగ్ కు వెళ్తుందని స్పష్టం చేశాడు గుణశేఖర్. ఇదంతా జరగడానికి ఇంకో రెండు మూడేళ్లు పట్టేలాగే కనిపిస్తోంది మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



