సంజయ్ దత్ చాలా చిరాకుగా ఉన్నాడట..!
on Jun 1, 2016
.jpg)
జైలుకు వెళ్లక ముందు సంజయ్ దత్ వేరు. జైలు నుంచి వచ్చిన తర్వాత సంజయ్ వేరు. అంతకు ముందు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ, పూర్తి బాలీవుడ్ సినిమా మనిషిలా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే జైలు జీవితం గడిపివచ్చాడో, ఆ తర్వాతి నుంచి అతనిలో పూర్తి మార్పు వచ్చేసింది. సినిమావాడిలా బతకడం మానేశాడు. పూర్తి కామన్ మ్యాన్ లా, ఫ్యామిలీకి టైం కేటాయిస్తూ, తనకు నచ్చిన సబ్జెక్ట్స్ వింటూ, చాలా ప్రశాంతంగా మారిపోయాడు. అందుకే ఇప్పుడు మీడియా ఎవరైనా తనను ఫోకస్ చేయాలనుకుంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు సంజూ బాబా. ప్రస్తుతం ఒక హాలీవుడ్ రీమేక్ లో నటిస్తున్న సంజూ, అందుకోసం కసరత్తులు కూడా చేస్తున్నాడట. అయితే ఈ ట్రైనింగ్ లో ఉన్న సంజయ్ స్టిల్ ఒకటి లీకవ్వడంతో, ఆయనకు కోపం నషాళానికంటిదట. ఎంత సినిమా వ్యక్తులమైనా, మాకంటూ కొద్దిగా ప్రైవసీ ఉంటుంది. దయచేసి దాన్ని గౌరవించండి. ఇష్టం వచ్చినట్టు, ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీసేయడం మ్యానర్స్ కాదు అంటూ చిరాకు పడుతున్నాడట సంజయ్. షూటింగ్, ఇల్లు మాత్రమే చూసుకుంటూ జీవిస్తున్న తన లైఫ్ ను ఫోటోలు తీయద్దని, అభిమానులు కూడా తన ఇంటికి రావద్దని రిక్వెస్ట్ చేస్తున్నాడు సంజయ్. బాలీవుడ్ జనాలంతా సంజయ్ లో ఇంత మార్పా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



