కరీనాకపూర్ ప్రెగ్నెన్సీలో ఉందా..?
on Jun 1, 2016

బాలీవుడ్ హాటెస్ట్ కపుల్ కరీనా, సైఫ్ లు పేరెంట్స్ కాబోతున్నారా..అవునంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. గత కొన్నాళ్లుగా బాలీవుడ్ లో కరీనా తల్లి కాబోతోందంటూ ప్రచారం సాగుతోంది. ఇప్పటికే చాలా సార్లు బెబో ఈ వార్తల్ని ఖండించినా ఇవి ఆగట్లేదు. ఇప్పుడు కరీనాతో సైఫ్ లండన్ పర్యటనలో ఉండటానికి కూడా ఆమె ప్రెగ్నెన్సీయే కారణమని, దాన్ని రహస్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారని బీటౌన్ కోడై కూస్తోంది. ప్రస్తుతం బెబోకు మూడున్నర నెలలు నిండాయని అంటున్నారు. సైఫ్ కు మొదటి భార్యతో ఇప్పటికే సంతానం ఉన్నారు. కరీనా నటించిన ఉడ్తా పంజాబ్ జూన్ లో విడుదల కానుంది. ఈ సినిమా కోసమైనా ఆమె మీడియా ముందుకు రాక తప్పదు. ఒక వేళ ఈ రూమర్ నిజమైతే అప్పుడే తెలుస్తుంది లెండి..!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



