హాలీవుడ్ లో ఆదరగొట్టనున్న విలక్షణ నటుడు
on Sep 26, 2013

నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా పలు చిత్రాల్లో నటిస్తూ అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ త్వరలోనే హాలీవుడ్ లో కూడా తన ప్రతిభను చూపించనున్నాడు. ప్రకాష్ రాజ్ నటించే హాలీవుడ్ సినిమా ఒకటి కాదు... ఏకంగా రెండు హాలీవుడ్ సినిమాలలో నటించనున్నాడట. ఈ రెండు సినిమాలలో ఒకటి వికాస్ స్వరూప్ రాసిన ‘సిక్స్ సస్పెక్ట్’ నవల ఆధారంగా రూపొందే సినిమా కాగా, రెండవది స్టీవెన్ స్పీల్ బర్గ్ దర్శకత్వంలో రూపొందబోయే మరో సినిమానట. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. వీటి గురించి ప్రకాష్ రాజ్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



