ఆమె కోసం దర్శకేంద్రుడి రాక
on Sep 26, 2013
మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం "దూసుకేల్తా". వీరుపోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మంచు లక్ష్మీ ఓ ప్రత్యేకపాత్రలో నటిస్తుంది. కేవలం ఈ పాత్రను రాఘవేంద్రరావుతో తెరకెక్కిస్తున్నారు. ఆ పాత్రకు సంబంధించిన ఫోటో మీకోసం.
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో విష్ణు సరసన "అందాల రాక్షసి" ఫేం లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియోను సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు.