మళ్ళీ బాద్ షా క్లైమాక్స్ లో రామయ్యా
on Sep 25, 2013
"బాద్ షా" చిత్రం క్లైమాక్స్ లో ఎన్టీఆర్ పోలీస్ గెటప్ లో కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "రామయ్యా వస్తావయ్యా". హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం క్లైమాక్స్ లో ఎన్టీఆర్ పోలీస్ గెటప్ లో కనిపించనున్నాడని తెలిసింది. కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, శృతిహాసన్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 10వ తేదీన విడుదల చేస్తున్నారు.