Home

»

Latest News

బాల‌య్య‌తో ప‌నిచేయ‌డం ఎలా అనిపించిందంటే.. షేర్ చేసుకున్న 'అఖండ' హీరోయిన్‌!

Nov 22, 2021 4:29PM

 

క్రిష్ డైరెక్ట్ చేసిన 'కంచె' సినిమాలో నాయిక‌గా న‌టించ‌డం ద్వారా వెలుగులోకి వ‌చ్చిన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ప్ర‌గ్యా జైస్వాల్‌, త్వ‌ర‌లో 'అఖండ' మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది. నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ రోల్ పోషించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'అఖండ' డిసెంబ‌ర్ 2న విడుద‌ల‌వుతోంది. ఈ మూవీలో ఐఏఎస్ ఆఫీస‌ర్ రోల్ పోషించిన ప్ర‌గ్యా.. ఇప్ప‌టివ‌ర‌కూ త‌న కెరీర్‌లో చేసిన మోస్ట్ మెమొర‌బుల్ క్యారెక్ట‌ర్స్‌లో ఇదొక‌ట‌నీ, ఇది చాలా స్ట్రాంగ్ క్యారెక్ట‌ర్ అనీ వెల్ల‌డించింది. మీడియాతో మాట్లాడిన హీరో బాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో ప‌నిచేసిన అనుభ‌వాన్ని పంచుకుంది.

"అఖండ‌లో నేను చేసిన పాత్ర లాంటిది గతంలో నేనెప్పుడూ చేయ‌లేదు. ఒక గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీస‌ర్‌గా ఈ సినిమాలో క‌నిపిస్తాను. ఆడియెన్స్‌ను నా క్యారెక్ట‌ర్ బాగా క‌నెక్ట‌వుతుంది" అని చెప్పింది ప్ర‌గ్యా. "బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ ఒక గొప్ప యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను మ‌న‌కు ప్రెజెంట్ చేస్తోంద‌ని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. ఈ మూవీని ఆడియెన్స్ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో చూడాల‌ని ఆత్రుత‌గా వెయిట్ చేస్తున్నా" అని తెలిపిందామె.

త‌ను చేసిన రోల్‌కు ముందుగా ప్రిపేర్ అవ‌డానికి త‌గినంత స‌మ‌యం ల‌భించ‌లేద‌ని వెల్ల‌డించింది ప్ర‌గ్యా. "న‌న్ను సంప్ర‌దించి, నేను ఓకే చెప్పిన వెంట‌నే షూటింగ్‌కు వ‌చ్చేశాను. అందువ‌ల్ల నాకు ల‌భించిన ప్రిప‌రేష‌న్ టైమ్ చాలా త‌క్కువ‌. అందువ‌ల్ల‌ క్యారెక్ట‌ర్‌లో ఇమిడిపోవ‌డానికి నాకు కొంత టైమ్ ప‌ట్టింది. రియ‌ల్ లైఫ్‌లో కొంత‌మంది లేడీ ఐఏఎస్ ఆఫీస‌ర్ల‌ను రిఫ‌రెన్స్‌గా తీసుకొని, వాళ్ల డ్రెస్సింగ్‌, మేన‌రిజ‌మ్స్‌, చిన్నాపెద్దా ప్ర‌తి అంశాన్నీ క్షుణ్ణంగా ప‌రిశీలించాను. దాంతో ఆ క్యారెక్ట‌ర్‌పై గ్రిప్ సంపాదించాను." అని చెప్పుకొచ్చింది ప్ర‌గ్యా.

"ఆడియెన్స్ మెచ్చేలా నా రోల్ రావ‌డంలో క్రెడిట్‌ను బోయ‌పాటి శ్రీ‌నుకే ఇస్తాను. నేను ఇదివ‌ర‌కు చేసిన సినిమాల్లోని ఏ పాత్ర కూడా 'అఖండ' మూవీలో చేసిన పాత్ర‌తో మ్యాచ్ కాదు. అలా నా రోల్‌ను ఆయ‌న తీర్చిదిద్దారు" అని ఆమె తెలిపింది. మ‌హ‌మ్మారి టైమ్‌లో షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆందోళ‌న చెందాన‌నీ, కానీ 'అఖండ' సెట్స్‌పై అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ త‌న‌కు సౌక‌ర్యంగా ఉండేట్లు యూనిట్ చూసుకుంద‌నీ ప్ర‌శంసించింది ప్ర‌గ్యా.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com