Home

»

Latest News

వెంకీ, బాల‌య్య‌, నాగ్, చిరు.. వ‌రుస నెలల్లో భ‌లే ఎంట‌ర్టైన్మెంట్!

Nov 22, 2021 4:13PM

మెగాస్టార్ చిరంజీవి, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, కింగ్ నాగార్జున‌, విక్ట‌రీ వెంక‌టేశ్.. మూడు ద‌శాబ్దాల‌కు పైగా టాలీవుడ్ బాక్సాఫీస్ ని శాసిస్తున్న ఈ టాప్ 4 సీనియ‌ర్ స్టార్స్..  న‌వంబ‌ర్ నుంచి ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు వ‌రుస చిత్రాల‌తో అల‌రించ‌నున్నారు.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. న‌వంబ‌ర్ 25న వెంకీ న‌టించిన ఫ్యామిలీ థ్రిల్ల‌ర్ `దృశ్యం 2` అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. 2014 నాటి `దృశ్యం`కి సీక్వెల్ గా ఈ సినిమా తెర‌కెక్కింది. ఇక డిసెంబ‌ర్ నెల‌లో బాల‌య్య న‌టించిన యాక్ష‌న్ డ్రామా `అఖండ‌` సంద‌డి చేయ‌నుంది. అఘోరాగా, రైతుగా రెండు విభిన్న పాత్ర‌ల్లో న‌ట‌సింహం న‌టించిన `అఖండ‌` డిసెంబ‌ర్ 2న థియేట‌ర్స్ లోకి రాబోతోంది.

అలాగే జ‌న‌వ‌రి నెల విష‌యానికి వ‌స్తే.. ఈ నెల‌లో నాగార్జున న‌టించిన `బంగార్రాజు` విడుద‌ల కానుంది. 2016 నాటి సంక్రాంతి విజేత `సోగ్గాడే చిన్ని నాయనా`కి సీక్వెల్ గా త‌యార‌వుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కూడా పొంగ‌ల్ నే టార్గెట్ చేసుకుంది. అదే విధంగా చిరు టైటిల్ రోల్ లో న‌టించిన `ఆచార్య‌` విష‌యానికి వ‌స్తే.. ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇక అదే నెలాఖరున అంటే ఫిబ్ర‌వ‌రి 25న వెంకీ న‌టించిన `ఎఫ్ 3` రాబోతోంది.

మొత్త‌మ్మీద‌.. న‌వంబ‌ర్ నుంచి ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు అంటే వ‌రుస‌గా నాలుగు నెల‌ల పాటు ఈ సీనియ‌ర్ స్టార్స్ వినోదాలు పంచ‌నున్నార‌న్న‌మాట‌. మ‌రి.. వీరిలో ఎవ‌రెవ‌రు బాక్సాఫీస్ ముంగిట విజ‌య‌ఢంకా మ్రోగిస్తారో చూడాలి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com