'జై భీమ్' కోసం ఎలుక మాంసం తిన్న సినతల్లి!
on Nov 22, 2021

'జై భీమ్' సినిమాలో సినతల్లి పాత్రలో నటించి మెప్పించింది మలయాళ సుందరి లిజోమోల్ జోస్. మరెవరూ ఆ పాత్రలో అలా నటించలేరు అనుకునేలా.. పాత్రలో జీవించి ప్రశంసలు అందుకుంది. అయితే ఆ పాత్ర కోసం తానెంతో శ్రమించానని, ఎలుక మాంసం కూడా తిన్నానని చెప్పి లిజోమోల్ జోస్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినతల్లి పాత్ర పోషించడానికి తాను పడిన కష్టాన్ని లిజోమోల్ జోస్ చెప్పింది. "జై భీమ్ కథను డైరెక్టర్ జ్ఞానవేల్ చెప్పగానే.. పాత్రలోని ఇన్‌టెన్సిటీ ఎంటో అర్థమైంది. ఇటువంటి పాత్ర కోసం ఎంతైనా కష్టపడాలని నిర్ణయించుకున్నాను. అందులో భాగంగా, డైటింగ్ చేసి బరువు కూడా తగ్గాను. అలాగే, నేను చేసింది గిరిజన స్త్రీ పాత్ర కాబట్టి.. గిరిజన మహిళలను కలుసుకుని వారితో కొన్ని రోజలు గడిపాను. వాళ్లు ఎలా ఉంటారు? ఏం తింటారు? అన్నీ తెలుసుకున్నాను. వారితో కలిసి అడవి ఎలుకలు పట్టడానికి వెళ్లి.. వాళ్ళు ఎలా పడుతున్నారో చూసి నేర్చుకున్నాను. ఒకసారి ఎలుక మాంసం కూడా తిన్నాను. ఎన్ని చేసినా ఆ పాత్ర కోసమే చేశాను. సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన ప్రశంసలతో నేను పడ్డ కష్టం అంతా మర్చిపోయాను." లిజోమోల్ జోస్ తెలిపింది.
సినిమాలో పాత్ర కోసం ఇంతలా కష్టపడిన లిజోమోల్ జోస్ పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఇంటర్వ్యూ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న నెటిజన్లు హ్యాట్సాఫ్ లిజోమోల్ జోస్ అంటూ ప్రశంసిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



