సైలెంట్ గా మొదలైన ప్రభాస్-మారుతి మూవీ షూట్!
on Oct 27, 2022

ఓ వైపు 'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్ k' వంటి భారీ సినిమాలు చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ మరోవైపు ఊహించనివిధంగా దర్శకుడు మారుతితో ఓ సినిమా చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సైలెంట్ గా చాలా తక్కువ టైంలో పూర్తి చేసి, ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేయాలని చూస్తున్నారట. అంతేకాదు ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైందని న్యూస్ వినిపిస్తోంది.
'బాహుబలి' తర్వాత కుర్ర దర్శకులకు అవకాశమిచ్చి ఇప్పటికే 'సాహో', 'రాధేశ్యామ్' సినిమాలతో షాక్ తిన్న ప్రభాస్.. మారుతికి అవకాశమిచ్చి మళ్ళీ తప్పు చేస్తున్నాడన్న అభిప్రాయం ఫ్యాన్స్ లో ఉంది. అయినప్పటికీ ప్రభాస్ వెనకడుగు వేయట్లేదు. స్క్రిప్ట్ కంప్లీట్ ఎంటర్ టైనర్ కావడం, కాల్షీట్స్ కూడా తక్కువ అవ్వడం వంటి కారణాలతో ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైనట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ కి సంబంధించిన కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని వినికిడి. ఇందులో 'బుజ్జిగాడు' తరహా కామెడీ టైమింగ్ ప్రభాస్ నుంచి ఆశించవచ్చని అంటున్నారు. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేయాలని చూస్తున్నారట. మరి ప్రభాస్ అభిమానులే అంతగా ఆసక్తి చూపించని ఈ ప్రాజెక్ట్ తో మారుతి ఊహించని విధంగా ఏదైనా మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, సంజయ్ దత్ తదితరులు నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



