బంగారంతో పూర్ణను ముంచెత్తిన భర్త!
on Oct 27, 2022

నటి పూర్ణ దీపావళి నాడు తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. దుబాయ్‌కి చెందిన బిజినెస్ మెన్ షానిద్ ఆసిఫ్ అలీతో పూర్ణ అలియాస్ షామ్నా కాసిం వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఐతే పూర్ణకి పెళ్లి కానుకుగా ఏమిచ్చారంటూ ఆరా తీస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. అందమైన పట్టుచీర, మెడ తిరగనివ్వని బంగారంతో సిగ్గుపడుతూ కనిపించింది పూర్ణ. ఐతే ఇప్పుడు పూర్ణ మెడలో బంగారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఐతే బిజినెస్ మాన్ అంటే మాటలా! పూర్ణ మెడలో ఉన్న బంగారం మొత్తం కూడా పెళ్లి కొడుకు వాళ్ళే పెట్టారని తెలుస్తోంది. ఈ బంగారం అంత కలిపితే 170 తులాలు అంటే సుమారు 1700 గ్రాముల బంగారం పెట్టారట. అంతే కాదు, ఒక సూపర్ లగ్జరీ విల్లాను కూడా గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్ణ కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అందరూ విష్ చేస్తున్నారు. ఇక మూవీస్ తో పాటు కొన్ని రియాలిటీ షోస్ కి జడ్జిగానూ అలరించింది పూర్ణ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



