విజయ్ కి పెళ్లయిపోయింది.. నోరు జారిన బ్యూటీ!
on Oct 27, 2022

ఇటీవల 'గుడ్ లక్ జెర్రీ' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్.. ఇప్పుడు 'మిలీ' అనే మరో చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతోంది. నవంబర్ 4న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ.. విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అతనికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ఇంటర్వ్యూలో యాంకర్ గా సరదాగా "మీకు స్వయంవరం జరిగితే, ఏ హీరోలు వస్తే బాగుంటుంది?" అని అడగగా.. జాన్వీ వెంటనే "హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, టైగర్ ష్రాప్" పేర్లు చెప్పింది. "హృతిక్, రణబీర్ కి ఇప్పటికే పెళ్లి అయిపొయింది కదా.. పెళ్లి కాని హీరోల పేర్లు చెప్పాలని" యాంకర్ అనడంతో జాన్వీ ఆలోచనలో పడింది. అదే సమయంలో యాంకర్ విజయ్ దేవరకొండ పేరుని ప్రస్తావించగా.. "అతనికి ప్రాక్టికల్ గా పెళ్లి అయింది" అంటూ జాన్వీ షాకింగ్ కామెంట్స్ చేసింది.
విజయ్, రష్మిక మందన్న చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఇటీవల మాల్దీవులకు వెళ్తూ ఎయిర్ పోర్ట్ లో కెమెరాలకు కూడా చిక్కారు. అప్పటినుంచి వారి ప్రేమ వార్తలు మరింత బలపడ్డాయి. ఇక తాజాగా జాన్వీ సైతం రష్మికతో విజయ్ లవ్, డేటింగ్ ని ఉద్దేశించే 'ప్రాక్టికల్ గా పెళ్లయిపోయింది' అనే కామెంట్స్ చేసుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



