హృతిక్ రోషన్ చిత్రంలో ప్రభాస్!
on Jan 27, 2023
ఆమధ్య రాజమౌళి ఎప్పుడో బిల్లా చిత్రం వేడుకలో ధూమ్ లాంటి చిత్రాలు హృతిక్ మాత్రమే ఎందుకు చేయగలడు? అలాంటి చిత్రాలు బాలీవుడ్ లోనే ఎందుకు వస్తాయి? అని అంటూ ప్రభాస్ ముందు హృతిక్ నథింగ్ అని కామెంట్ చేశారు. అవి ఇటీవల ప్రచారంలోకి వచ్చి పలు వివాదాలకు కారణమయ్యాయి.
ఇక విషయానికి వస్తే బాలీవుడ్ లో ఆరడుగుల అందగాడు ఎవరబ్బా అంటే ముందుగా హృతిక్ రోషన్ పేరు వినిపిస్తోంది. తెలుగులో అలా ఆరడుగుల అందగాడు అంటే ప్రభాస్ అని చెప్పుకోవాలి. మరి వీరిద్దరూ కలిసి ఓ చిత్రంలో నటిస్తే ఎలా ఉంటుంది? బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది. దాంతో వీరి కాంబోలో ఓ సినిమా చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రం ఉండనుంది.
ఇక ప్రస్తుతం సిద్ధార్థ ఆనంద్ పఠాన్ చిత్రం విజయానందంలో ఉన్నారు. దీని తరువాత ఆయన హృతిక్ రోషన్ తో ఫైటర్ అనే సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే బ్యాంగ్ బ్యాంగ్, వార్ వంటి సినిమాలు వచ్చాయి. ఇవి ఘన విజయం సాధించాయి. ఇక హృతిక్ రోషన్ హీరోగా తెరకు ఎక్కుతున్న సినిమాలో ప్రభాస్ ను ఒక అతిధి పాత్ర కోసం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దానికి ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. ఒక రకంగా ఇలాంటి ఇద్దరు స్టార్ హీరోలు ఒక సినిమాలో కనిపిస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని అంచనాలు ఏర్పడతాయి. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో వేచి చూడాలి....!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
