‘అల వైకుంఠపురంలో’ గొడవకు కారణం ఎవరు?
on Jan 27, 2023
టాలీవుడ్ లో ఐకాన్ సార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన అల వైకుంఠపురంలో చిత్రం ఇక్కడ ఘన విజయం సాధించింది. దాంతో ఈ చిత్రం రీమేక్ హక్కులను తీసుకుని కార్తీక్ ఆర్యన్ హీరోగా ఈ చిత్రం రీమేక్ ప్రారంభమైంది. ఇదే సమయంలో పుష్ప చిత్రం సూపర్ హిట్ కావడంతో ఉత్తరాదిన అల్లు అర్జున్ క్రేజీ పెరిగింది. ఇక్కడ నిర్మాతలు చేసిన పెద్ద తప్పిదం ఏమిటంటే ఈ చిత్రం డబ్బింగ్ వర్షన్ రైట్స్ ను గోల్డ్ మైన్స్ వారికి అమ్మారు. కార్తీక్ ఆర్యన్ అల వైకుంఠపురంలో చిత్రాన్ని షెహజాదా పేరుతో తీశారు.
ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. ఫిబ్రవరి 10వ తారీఖున షెహజాదా విడుదల కాబోతోంది. అదే సమయంలో అల వైకుంఠపురంలో డబ్బింగ్ వర్షన్ గోల్డ్ మైన్స్ వారు యూట్యూబ్ ద్వారా స్ట్రీమింగ్ కు సిద్ధం చేశారు. షహజాదా థియేట్రికల్ రిలీజ్ కు వారం రోజుల ముందు అంటే ఫిబ్రవరి రెండున యూట్యూబ్ ఛానల్ ద్వారా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అదే జరిగితే అల వైకుంఠపురంలో హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో ప్రత్యక్షమవుతుంది. దాంతో రీమేక్‌గా వచ్చే షహజాదా ఓపెనింగ్స్ విషయంలో ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో కొందరు పెద్దలు డబ్బింగ్ వర్షన్‌ను యూట్యూబ్లో స్ట్రీమింగ్ కాకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా అల వైకుంఠపురంలో సినిమా రీమేక్ డబ్బింగ్ వర్షన్ల మధ్య పెద్ద దుమారమే చెలరేగుతుంది. ఈ వివాదాన్ని ఏ సినీ పెద్దలు పరిష్కరిస్తారో వేచి చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
