'సాహో' మిస్.. 'ఆదిపురుష్' యస్...
on Nov 20, 2020

'బాహుబలి' సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ తరువాత వచ్చిన 'సాహో' ఇక్కడ ఆశించిన విజయం సాధించకపోయినా.. హిందీనాట వసూళ్ళ పంట పండించింది. ప్రస్తుతం ప్రభాస్.. 'రాధే శ్యామ్', 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్ డైరెక్టోరియల్.. ఇలా ఒకదానితో ఒకటి పొంతన లేని ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
వీటిలో 'రాధే శ్యామ్' 2021 వేసవిలో విడుదల కానుండగా.. 'ఆదిపురుష్' 2022లో ఆగస్టు 11న సందడి చేయనుంది. ఇక నాగ్ అశ్విన్ సినిమా 2023లో రిలీజ్ అయ్యే అవకాశముందంటున్నారు. అంటే ఏడాదికో పాన్ ఇండియా మూవీతో ప్రభాస్ పలకరించబోతున్నారన్నమాట.
ముఖ్యంగా 'ఆదిపురుష్' విడుదల తేది విషయానికి వస్తే.. 2022 పంద్రాగస్టు వారాంతాన్ని లక్ష్యంగా చేసుకుంది. వాస్తవానికి గత ఏడాది 'సాహో'ని కూడా ఇలానే ఆగస్టు 15 వీకెండ్‌కి రిలీజ్ చేయాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆగస్టు 30కి వాయిదాపడింది. మరి.. 'ఆదిపురుష్' అయినా ఇండిపెండెన్స్ డే వీకెండ్‌లో సిల్వర్ స్క్రీన్ పైకి వస్తుందో, లేదంటే వాయిదా పడుతుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



