అయ్యయ్యో... శ్రీముఖికి 'ఆర్ఆర్ఆర్' మిస్!
on Nov 20, 2020

అవును... బుల్లితెర రాములమ్మ శ్రీముఖి 'ఆర్ఆర్ఆర్' మిస్ అయింది! అయితే... ఇక్కడ మిస్ అయ్యింది 'ఆర్ఆర్ఆర్' సినిమా కాదు. జస్ట్ టైటిల్ మాత్రమే. సాధారణంగా 'ఆర్ఆర్ఆర్' అంటే దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎవరికైనా గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రమే. అయితే, ఆ టైటిల్ శ్రీముఖి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఒక సినిమాకి పెట్టాలని అనుకున్నారు. అసలు వివరాల్లోకి వెళితే...
శ్రీముఖి, రాజా రవీంద్ర, సింగర్ మనో, భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'క్రీజీ అంకుల్స్'. ముందు ఈ సినిమాకి 'ఆర్ఆర్ఆర్' టైటిల్ అనుకున్నట్టు దర్శకుడు ఇ. సత్తిబాబు చెప్పారు. 'ఆర్ఆర్ఆర్' అంటే రెడ్డిగారు, రాజుగారు, రావుగారు అని అనుకున్నారట. కానీ, ఎందుకో ఆ టైటిల్ కన్ఫర్మ్ చేయలేదు. ఆ తరవాత 'క్రేజీ అంకుల్స్' టైటిల్ కన్ఫర్మ్ చేశారు. అదీ సంగతి!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



