సుశాంత్ కేసు.. యూట్యూబర్‌పై అక్షయ్ రూ. 500 కోట్ల దావా!
on Nov 20, 2020

బిహార్‌కు చెందిన ఓ యూట్యూబర్‌పై బాలీవుడ్ సూపర్‌స్టార్ రూ. 500 కోట్ల పరువునష్టం దావా వేశాడు. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుకు సంబంధించిన బిహార్‌కు చెందిన రషీద్ సిద్దిఖి అనే వ్యక్తి తన వీడియోలలో అక్షయ్ పేరును లాగాడు. యూట్యూబర్ అయిన అతను డిజిటల్ మీడియాను ఉపయోగించుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ పలువురు సెలబ్రిటీల గురించి ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తున్నాడు. ఒక రిపోర్ట్ ప్రకారం, నాలుగు నెలల వ్యవధిలో సిద్దిఖి దాదాపు రూ. 15 లక్షలను ఆర్జించాడు. అంతే కాదు, అతని చానల్ సబ్‌స్క్రైబర్స్ 2 లక్షల నుంచి 3 లక్షలకు పెరిగారు.
పలుమార్లు తన వీడియోల ద్వారా అక్షయ్ కుమార్‌పై అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. ఉదాహరణకు, ఒక వీడియోలో సుశాంత్‌సింగ్‌కు ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ లాంటి పెద్ద సినిమాలు రావడంపై అక్షయ్ అసంతృప్తి చెందాడని ఆరోపిస్తే, ఇంకో వీడియోలో ఆదిత్య థాకరేతో, ముంబై పోలీసులతో ఆయన రహస్య సమావేశాలు జరిపాడనీ ఆరోపించాడు. అంతటితో అతని ఫేక్ న్యూస్ ఆగలేదు. సుశాంత్ గాళ్‌ఫ్రెండ్ రియా చక్రవర్తితో అక్షయ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనీ, ఆమె కెనడాకు పారిపోవడానికి అక్షయ్ సహాయం చేశాడని కూడా అతను చెప్పుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



