కృష్ణంరాజు, ప్రభాస్.. ఫస్ట్ టైమ్!
on Dec 25, 2021

రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా తెరంగేట్రం చేసినా.. అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇక `బాహుబలి` సిరీస్ తో ఏకంగా పాన్ - ఇండియా స్టార్ అయిపోయాడు. కాగా, రానున్న సంక్రాంతికి `రాధే శ్యామ్`తో పలకరించబోతున్నాడు ఈ ఉప్పలపాటి వారి హ్యాండ్సమ్ హీరో. ఇందులో కృష్ణంరాజు కూడా ఓ ప్రత్యేక పాత్రలో దర్శనమివ్వనుండడం విశేషం. పరమహంసగా సరికొత్త వేషంలో కనిపించనున్నారు కృష్ణంరాజు.
ఇదిలా ఉంటే.. పాన్ - ఇండియా స్టార్ కాకముందు పెదనాన్న కృష్ణంరాజుతో `బిల్లా`, `రెబల్` చిత్రాల్లో కలిసి నటించాడు ప్రభాస్. వాటిలో `బిల్లా` ఓకే అనిపించుకోగా, `రెబల్` ఆశించిన విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో.. `రాధే శ్యామ్` ఫలితంపై ఆసక్తి నెలకొని ఉంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. కృష్ణంరాజు, ప్రభాస్ కలిసి నటించగా సంక్రాంతి సీజన్ లో వస్తున్న మొదటి సినిమా `రాధే శ్యామ్`నే కానుంది. మరి.. ఫస్ట్ టైమ్ పొంగల్ టైమ్ లో కలిసి వస్తున్న కృష్ణంరాజు, ప్రభాస్.. ఏ స్థాయిలో ఆకట్టుకుంటారో తెలియాలంటే జనవరి 14 వరకు వేచిచూడాల్సిందే.
`జిల్` ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహించిన `రాధే శ్యామ్`లో ప్రభాస్ కి జోడీగా `బుట్టబొమ్మ` పూజా హెగ్డే కనిపించనుంది. పిరియడ్ లవ్ సాగాగా `రాధే శ్యామ్` రూపొందింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



