2021 జ్ఞాపకాలుః `హ్యాట్రిక్` కాంబోస్!
on Dec 24, 2021

ఇప్పటికే రెండు సక్సెస్ ఫుల్ మూవీస్ తో ఆకట్టుకున్న కొన్ని హిట్ కాంబినేషన్స్ (హీరో - డైరెక్టర్).. ఈ ఏడాది ముచ్చటగా మూడోసారి సందడి చేశాయి. `హ్యాట్రిక్` కొట్టిన ఆ కాంబోస్ వివరాల్లోకి వెళితే..
బాలకృష్ణ - బోయపాటి శ్రీనుః
`సింహా`, `లెజెండ్` చిత్రాలతో సెన్సేషనల్ కాంబినేషన్ అనిపించుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ - మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను.. ఈ ఏడాది చివరలో `అఖండ`తో మరో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు. `హ్యాట్రిక్ కాంబినేషన్`గా వార్తల్లోకెక్కారు.
రవితేజ - గోపీచంద్ మలినేనిః
`డాన్ శీను`, `బలుపు` చిత్రాలతో మాస్ ప్రేక్షకులను మస్త్ ఎంటర్టైన్ చేసిన మాస్ మహారాజా రవితేజ - టాలెంటెడ్ కెప్టెన్ గోపీచంద్ మలినేని.. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన `క్రాక్`తో గత చిత్రాలకు మించిన విజయాన్ని చూశారు. ఈ క్యాలెండర్ ఇయర్ లో తొలి ఘనవిజయాన్ని నమోదు చేసి.. `హ్యాట్రిక్` కాంబో గా నిలిచారు.
అల్లు అర్జున్ - సుకుమార్ః
`ఆర్య`, `ఆర్య 2`తో అలరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్.. ఈ ఏడాది చివరలో పాన్ - ఇండియా మూవీ `పుష్ప - ద రైజ్`తో ఎంటర్టైన్ చేశారు. హ్యాట్రిక్ కాంబినేషన్ అనిపించుకున్నారు.
రామ్ - కిశోర్ తిరుమలః
`నేను శైలజ`, `ఉన్నది ఒక్కటే జిందగీ` వంటి ఫీల్ గుడ్ మూవీస్ తో ఇంప్రెస్ చేసిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని - టాలెంటెడ్ డైరెక్టర్ కిశోర్ తిరుమల.. ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన మాస్ థ్రిల్లర్ `రెడ్`తో `హ్యాట్రిక్ కాంబినేషన్` అనిపించుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



