ఎందుకు పెట్టారు..ఎందుకు తీసేశారు..?
on Aug 26, 2017
పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ శరవేగంగా దూసుకెళ్తోంది. అసలు ఈ మూవీకి సంబంధించి ఒక్క పిక్ గానీ...చివరికి ఏ చిన్న న్యూస్ కూడా బయటకు రానీయకుండా చాలా గుట్టుగా తన పని తాను చేసుకుపోతున్నాడు త్రివిక్రమ్. వారి సంగతేమో కానీ అభిమానులు మాత్రం పవన్ లుక్ ఎలా ఉండబోతుందా అని తెగ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక హంగామా ఉంటుందని ఫ్యాన్స్ ఊహించారు. కానీ సెప్టెంబర్ 2న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. దీనిని అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయడానికి కళ్లజోడు స్టిల్‌తో ఉన్న ఒక ఫోటోను రిలీజ్ చేసింది.
ఈ స్టిల్ నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పవన్ ఫ్యాన్స్ తమ సన్నిహితులకు దీనిని షేర్ చేసుకుంటున్న సమయంలో షాక్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమాను నిర్మిస్తున్న హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌కు చెందిన అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి ఈ స్టిల్‌ను తొలగించడంతో పవన్ అభిమానులు కన్ఫ్యూజన్కు గురయ్యారు. పొద్దున్న పోస్ట్ చేసి సాయంత్రానికి పోస్టర్‌ను తీసివేయాల్సిన అవసరం ఏమొచ్చింది..ఫస్ట్ లుక్ లేట్ అవుతుందా..? లేక మరేదైనా కారణమో తెలియక ఫ్యాన్స్ జుట్టుపీక్కుంటున్నారట.