టీజర్ రివ్యూ: కాటమరాయుడు
on Feb 4, 2017

సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ తర్వాత ఫ్యాన్స్‌కి అదిరిపోయే కిక్ ఇవ్వాలని కంకణం కట్టుకున్నాడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో తమిళ్ సూపర్‌హిట్ వీరంను డాలీ దర్శకత్వంలో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడు. మొత్తం తమిళ్ వెర్షన్‌ను మక్కీకి మక్కీ దింపేయకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పు చేశాడు డాలీ. పవన్ పొలిటిక్స్‌లో బిజీ అవ్వడం వల్ల కాస్త ఆలస్యమైనప్పటికి..ఆ తర్వాత షూటింగ్‌ను సూపర్ ఫాస్ట్‌గా కంప్లీట్ చేసింది చిత్రయూనిట్. ఫస్ట్ లుక్, పోస్టర్స్‌తో మూవీపై హైప్ క్రియేట్ చేశారు దర్శక నిర్మాతలు. తాజాగా కాటమరాయుడు టీజర్‌ను రిలీజ్ చేశారు.. టీజర్ ఎలా ఉందో ఓ లుక్కెస్తే..
"ఎంతమంది ఉన్నారన్నది కాదు ఎవడున్నాడన్నదే ముఖ్యం"అంటూ పవర్‌ఫుల్ డైలాగ్‌తో ఆరంభమయ్యే 50 సెకన్ల టీజర్‌లో హాఫ్ పర్సెంట్ ఫైట్లే..ఇందులో ఎక్కడా హీరోయిన్‌కు కానీ.. పాటకు కానీ చోటివ్వలేదు. రాయుడు అంటూ వినిపించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా ఉంది. ఏదో పాటకు పవర్‌స్టార్ తమ్ముళ్లతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు..అంటే పవన్ మార్క్ అల్లరి ఉంటుందని అర్థమవుతోంది. మొత్తానికి ఇప్పటి వరకు ఫుల్ లెంగ్త్ మాస్ మూవీ చేయని పవన్ ఫస్ట్ టైం మాస్ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నాడన్న మాట. పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న కాటమరాయుడు ఉగాదికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



