గాలి కుమార్తెతో యాంకర్ లాస్యకు సంబంధం..?
on Feb 4, 2017

గాలి జనార్థన్ రెడ్డి కూతురేంటి..? యాంకర్ లాస్యతో సంబంధం ఏంటి..? అని మీరు ఏదేదో అనుకోవద్దు. తన కూతురు బ్రహ్మాణీ పెళ్లిని అంగరంగ వైభవంగా..చరిత్రలో నిలిచేపోయేలా చేయాలనుకున్నాడు గాలి జనార్థన్ రెడ్డి. అందుకు తగ్గట్టుగానే ఒకే ఒక్క శుభలేఖతో దేశం మొత్తాన్ని తనవైపుకు తిప్పుకునేలా చేశాడు. దేశమొత్తం నోట్ల రద్దు గురించి కన్నా...గాలి తన కూతురు పెళ్లి ఎలా చేస్తాడు అనుకునేంతగా చర్చను లేవదీశాడు. సరే ఇదంతా పక్కనబెడితే మరీ గాలీ జనార్థన్ రెడ్డి రేంజ్‌లో కాకున్నా ప్రతి మనిషి తన పెళ్లిని..తనకున్నంతలో గ్రాండ్‌గానే చేయాలనుకుంటాడు.
దీనిలో భాగంగానే తెలుగు బుల్లితెరపై తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్ లాస్య ఈ మధ్యే తనకు ఏంగేజ్‌మెంట్ అయ్యిందంటూ బాంబు పేల్చింది. ఆ తర్వాత అచ్చం గాలి బ్రహ్మాణీ తరహాలోనే కాబోయే వరుడు మంజుతో ఒక మెలోడీ సాంగ్‌లో కలిసి నటించింది..అంతేనా సాంగ్ ఎండింగ్‌లో కమింగ్ సూన్ అంటూ టైటిల్స్ వేయించింది. మొత్తానికి లాస్య ఏంగేజ్‌మెంట్ చూడలేదనుకున్న వారికి ఈ వీడియోతో ఆ లోటు తీర్చేసింది లాస్య.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



